గుమ్మడికాయను పడవగా చేసుకొని దానిపై 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించాడు అమెరికాకు చెందిన గ్యారీ క్రిస్టెన్‌సేన్. ఒరెగ్యాన్ హ్యాపీవాయలీకి చెందిన గ్యారీ 555.2 కేజీల గుమ్మడికాయలోని గుజ్జును తీసి పడవగా మార్చాడు. దీంతో కొలంబియా నదిలో వాషింగ్టన్‌లోని నార్త్ బొన్నెవిల్లి నుంచి వాంకోవర్ వరకు ప్రయాణించాడు. గుమ్మడికాయ పడవపై అంతకు ముందెవ్వరూ ఇంత దూరం ప్రయాణం చేయకపోవడంతో దానిని గిన్నిస్ రికార్డుగా నమోదు చేశారు. స్వతాహాగా భారీ సైజులో గుమ్మడికాయలు పెంచడం గ్యారీకి అలవాటు. 2013లో అలా తయారు చేసిన గుమ్మడికాయ పడవపై ప్రయాణం చేసి స్థానిక పోటీలో బహుమతి గెల్చుకున్నాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)