అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఢల్లీి రానున్నారు. భారత్‌లో ఆయన జరపనున్న తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షునిగా బో బైడెన్ పదవీ స్వీకారం చేసిన తర్వాత దేశ పర్యటనకు వచ్చిన మూడో అత్యున్నత నాయకుడు ఈయనే కావడం ఇంకో విశేషం. మార్చిలో రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, ఏప్రిల్‌లో పర్యావరణ మార్పుల ప్రత్యేక రాయబారి జాన్ కెర్రీలు వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అఫ్గాన్ సమస్యపై ప్రధానంగా చర్చిస్తారు. అనంతరం ఆయన ఢల్లీి నుంచి కువైట్ వెళ్తారు.