శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహావీరుడు. మడోన్ అశ్విన్ దర్శకుడు. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ కథానాయిక. ఈ సినిమా చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఓ ఆసక్తికరమైన కథాంశంతో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. ఇందులో శివ కార్తికేయన్ మాస్ లుక్‌తో సరికొత్తగా కనిపించనున్నారు. హీరోయిజం ఉండే ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని, కథా నేపథ్యం, హీరో క్వారెక్టరైజేషన్ ఆకట్టుకుంటాయని దర్శక నిర్మితలు తెలిపారు. యోగిబాబు, సరిత, మిస్కిన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: ఫిలోమిన్ రాజ్, సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న, సంగీతం: భరత్ శంకర్.