
మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు ఆటంకం కలగడం ఐటీ చరిత్రలోనే అతిపెద్ద అంతరాయంగా ఐటీ నిపుణులు అభివర్ణిస్తున్నారు. సైబర్ దాడి వల్ల ఇలా జరిగి ఉండొచ్చని సైబర్ నిపుణుడు అనూజ్ అగర్వాల్ అభిప్రాయ పడ్డారు. మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద సంస్థలు అప్‌డేట్లు చేసినప్పుడు పూర్తిస్థాయిలో టెస్టింగ్ చేస్తారని, అయినా ఇది జరిగిందంటే సైబర్ దాడి కావొచ్చని పేర్కొన్నారు. ఈ సమస్య వ్యాపారాలపై తక్షణ ప్రభావం చూపించ డంతో పాటు చాలా నెలల పాటు సైబర్ సెక్యూరిటీ ముప్పుకు కారణం కావొచ్చని గ్రేహౌండ్ రీసెర్చ్ వ్యవస్థాప కుడు సంచిత్‌వర్ గోగియా హెచ్చరించారు. చరిత్రలో ఇది అతిపెద్ద ఐటీ అంతరాయంగా సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ట్రోయ్ హంట్ పేర్కొన్నారు.
