Namaste NRI

బ్లాక్ అండ్ వైట్ మూవీ టీజర్ ని రిలీజ్ చేసిన.. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్

బ్లాక్‌ అండ్‌ వైట్‌ అంటూ సందడి చేసేందుకు సిద్దమైంది నటి హెబ్బా పటేల్‌. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఎల్‌ఎన్‌వీ సూర్య ప్రకాష్‌ తెరకెక్కించారు. పద్మనాభ రెడ్డి, సందీప్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సూర్య శ్రీనివాస్‌, లహరి శారి నవీన్‌ నేని ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌ విడుదల చేశారు. నో కమిట్‌మెంట్‌.. నో కంట్రోల్‌.. నో రిస్ట్రిక్షన్స్‌, లెట్స్‌ సెలబ్రేట్‌ యువర్‌ ఫ్రీడమ్‌ అంటూ హెబ్బా చెప్పే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి ఇదొక థ్రిల్లర్‌ కథతో తెరకెక్కిన చిత్రమని అర్థమవుతోంది. యువతరం కోరుకునే అన్ని రకాల అంశాలు ఇందులో పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్కంఠభరితమైన ఈ టీజర్‌ థ్రిల్లర్‌ సినిమా ప్రేమికులను ఆకట్టుకునే లా ఉంది. టీజర్‌ కట్‌తో దర్శకుడు సూర్య ప్రకాశ్‌ ఆసక్తిని రేకెత్తించాడు. టి సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ హైలైట్‌  అవుతోంది. అజయ్‌ అరసాడ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events