సాధారణంగా ఓ కోడిగుడ్డు ధర రూ.6-7 ఉంటుంది. అయితే, యూకేలో మాత్రం ఓ కోడిగుడ్డు ఏకంగా రూ.21 వేలకు అమ్ముడుపోయింది. పైగా దీనిని కొనేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. అండాకారంలో ఉండే సాధారణ కోడిగుడ్లకు భిన్నంగా గుండ్రంగా ఉండటమే ఈ కోడిగుడ్డు ప్రత్యేకత. ఏమాత్రం తేడా లేకుండా, పూర్తి గుండ్రంగా ఉండే కోడిగుడ్లు చాలా అరుదుగా కనిపిస్తాయని, వంద కోట్ల గుడ్లలో ఒకటి ఇలా ఉంటుందని చెప్తున్నారు.
బెర్క్‌షైర్‌కు చెందిన ఎడ్ పౌనెల్ అనే వ్యక్తి మొదట దీన్ని ఒక పబ్‌లో సుమారు రూ.16 వేలకు కొన్నారు. అయితే, అరుదైన ఈ గుడ్డును దాతృత్వ వేలం కోసం వినియోగించాలని నిర్ణయించి ఇవెంటస్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. ఈ ఫౌండేషన్ నిర్వహించిన వేలంలోనే అసాధారణ రీతిలో రూ.21 వేలకు ఈ కోడిగుడ్డు అమ్ముడుపోయింది.