చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ వైరస్ విజృంభణ చూస్తే ఇప్పడప్పుడే అదుపులోకి వచ్చే పరిస్థితి ఏ మాత్రం కనబడటం లేదు. చివరికి రోజువారీ కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో 4,477కి పెరగడంతో షాంఘై నగరం తూర్పు భాగంలో నివసించే ప్రజలకు లాక్డౌన్ పరిమితులను విధించింది చైనా ప్రభుత్వం. ఆ ప్రాంత ప్రజలు కేవలం కోవిడ్ పరీక్ష కోసం మాత్రమే బయటకు రావాలని ఉత్తర్వులు జారీ చేసింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్తో పాటు ఫైనాన్షియల్ సంస్థలకు పేరున్న పుడోంగ్ జిల్లాలో కోవిడ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో అక్కడి స్థానిక అధికారులు ఆ ప్రాంతంలో లాక్డౌన్ విధించారు. వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు నివాసితులు బయటకు రావడం, బహిరంగ ప్రదేశాలలో తిరగడం నిషేధమని, షాంఘై మున్సిపల్ హెల్త్ కమిషన్ అధికారి తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)