ఈ ఏడాది జనవరిలో అమెరికా క్యాపిటల్ హిల్ భవనంపై జరిగిన దాడికి సంబంధించి సున్నితమైన సమాచారం అందించాల్సిందిగా కాంగ్రెస్ నుంచి అందిన వినతికి దేశాధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారు. ఆ వివరాలను చేరవేయాల్సిందిగా రికార్డుల పరిరక్షణ అధికారిని ఆయన ఆదేశించారు. వాస్తవానికి ఈ సమాచారం శ్వేతసౌధ కార్యనిర్వహణ విశేషాధికారాల పరిధిలోకి వస్తుంది. అసాధారణ పరిస్థితుల్లో ఆ పరిధిలోని అంశాలనూ వెల్లడిరచొవచ్చని బైడెన్ పేర్కొన్నారు. కార్యనిర్వహణ విశేషాధికారాల కవచాన్ని చీల్చి ఆ వివరాలను కాంగ్రెస్‌కు అందించేలా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అమెరికా రాజకీయా వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈ నిర్ణయం మున్ముందు బైడెన్‌కు, భవిష్యత్తు అధ్యక్షులకు తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)