Namaste NRI

దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన దేవెగౌడ కుటుంబం

జనతాదళ్‌ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుటుంబం అరుదైన ఘనత సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవెగౌడ పెద్ద కుమారుడైన రేవణ్ణ తనయుడు సూరజ్‌ రేవణ్ణ హసన్‌ నుంచి విజయం సాధించారు. ఫలితంగా పార్లమెంటుతో పాటు కర్ణాటక ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కుటుంబంగా అవతరించింది. దేవెగౌడ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, ఆయన చన్ని కుమారుడు కుమారస్వామి చెన్నపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. సూరజ్‌ సోదరుడు ప్రజ్వల్‌ ఎంపీగా కొనసాగుతుండగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో సూరజ్‌ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సూరజ్‌ తండ్రి రేవణ్ణ హోలెనర్సిపుర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, తల్లి భవాని జిల్లా పరిషత్‌ సభ్యురాలు, మాజీ ముఖ్యమంత్రి అయిన కుమారస్వామి భార్య అనిత రామనగర నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి కుమారుడు నిఖిల్‌ జేడీఎస్‌ యూత్‌ వింగ్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఫలితంగా ఒకే కుటుంబ నుంచి లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, విధాన పరిషత్‌ ఇలా నాలుగు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంలో ఏకైక కుటుంబంగా దేవెగౌడ కుటుంబం రికార్డులకెక్కింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events