యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు డేవిడ్ ససోలి కన్నుమూశారు. 65 ఏళ్ల ససోలి రోగ నిరోధక శక్తి క్షీణించడంతో గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. ససోలి గతేడాది సెప్టెంబర్ నుంచి న్యూమోనియా సంబంధిత జబ్బు కారణంగా ఇటలీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన విషయం తెలిసిందే. ఇటాలియన్ జర్నలిస్ట్‌గా కెరియర్ ప్రారంభించిన ససోలి ఆ తర్వాత టెలివిజన్ యాంకర్‌గా జాతీయ స్థాయిలో పేరు సంపాదించారు. 2009లో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్‌లో సభ్యుడిగా, 2019లో స్పీకర్‌గా సేవలందించారు. డేవిడ్ ససోలి మరణంపై పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు.
ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో యూరోపియన్ పార్లమెంట్ ప్రధాన కార్యాలయం ఉంది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన 45 కోట్ల మంది పౌరులకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఏడు శాఖలలో ఒకటైన ఇందులో 700 మందికి పైగా సభ్యులను సభ్య దేశాలు నేరుగా ఎన్నుకుంటాయి.