దిలీప్‌ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ఉత్సవం. అర్జున్‌సాయి దర్శకత్వం. ఈ చిత్రానికి సురేష్ పాటిల్ నిర్మాత. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతు న్నది. దర్శకుడు మాట్లాడుతూ ప్రేమ, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే బ్యూటీఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో పాటు చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. ప్రకాష్‌రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, రచన-దర్శకత్వం: అర్జున్‌సాయి.