Namaste NRI

దేశంలోనే తొలి టైమ్‌ ట్రావెల్‌ మూవీగా చరిత్ర సృష్టించిన సినిమా : బాలకృష్ణ   

నందమూరి బాలకృష్ణ  కథానాయకుడిగా 1991లో రూపొందిన క్లాసిక్‌ మూవీ ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 4న రీరిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా రీరిలీజ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ  సందర్భంగా బాలకృష్ణ  మాట్లాడారు. ఈ సినిమా చేయడానికి నాన్నగారే నాకు స్ఫూర్తి. రొటీన్‌కి భిన్నమైన సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆదిత్య 369  చేశాను. ఎస్పీబాలు, నిర్మాత కృష్ణప్రసాద్‌ సారథులై నడిపించారు. ముందు చూపుతో ఆలోచించి సింగీతం శ్రీనివాసరావుగారు చేసిన అద్భుతం ఈ సినిమా. జనరేషన్స్‌ మారుతున్నా ఇంకా ఆదిత్య 369 ని ఇష్టపడుతూనే ఉన్నారంటే ఆ సినిమా గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా సీక్వెల్‌కి సంబంధించిన కథ కూడా పూర్తయింది. ఇక మొదలుపెట్టడమే ఆలస్యం. దేశంలోని తొలి టైమ్‌ ట్రావెల్‌ మూవీగా చరిత్ర సృష్టించిన సినిమా ఇది అని అన్నారు.  ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినందుకు దర్శకులు అనిల్‌ రావిపూడి, కె.ఎస్‌.రవీంద్ర ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌, బాబుమోహన్‌ మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events