అభినవ్ మణికంఠ హీరోగా రూపొందుతున్న చిత్రం బొమ్మ హిట్. పూజా యడం కథానాయిక. రాజేష్ గడ్డం దర్శకత్వం లో గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. చక్కటి వినోదంతో సాగే ఈ కథలో ఎమోషన్స్ కూడా ఉంటాయని హీరో అభినవ్ మణికంఠ చెప్పారు. వినోదంతోపాటు చక్కని సందేశం కూడా ఈ సినిమాలో ఉంటుందని, వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి, వచ్చే వేసవిలో విడుదల చేస్తామని దర్శకుడు రాజేష్ గడ్డం తెలిపారు.

కుటుంబ బంధాలతో కూడిన బలమైన కథ ఇదని, మా హిట్ బొమ్మ హిట్ అవ్వడం పక్కా అనీ నిర్మాత గుర్రాల సంధ్యారాణి నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా కథానాయిక పూజా యడం, నటులు మురళీధర్‌గౌడ్, హైపర్ ఆది, అవినాష్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్ నారగాని, సంగీతం: వంశీకాంత్ రేఖన, నిర్మాణం: అంజనీపుత్ర ఫిల్మ్స్.















