
జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం యముడు. ధర్మో రక్షతి రక్షితః ఉపశీర్షిక. శ్రావణి శెట్టి కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా ఇదని, యముడి పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు కీలకంగా ఉంటాయని, సరికొత్త కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విష్ణురెడ్డి వంగా, సంగీతం: భవాని రాకేష్, కథ, దర్శకత్వం, నిర్మాత: జగదీష్ ఆమంచి.
