టోరంటో కేంద్రంగా ఈ నెల 25, 26 తేదీల్లో ప్రథమ కెనడా తెలుగు సాహితీ సదస్సు నిర్వహించనున్నారు. అదే విధంగా 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కూడా నిర్వహించనున్నారు. వర్చువల్‌గా జరిగే సదస్సుకు సుమారు 100 మంది అమెరికా`కెనడా సాహితీవేత్తలు తమ ప్రసంగ ప్రతిపాదనలు పంపించారని నిర్వాహకులు తెలిపారు. ఆయా వక్తలందరికీ పేరు పేరునా నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. సెప్టెంబరు 25న https://bit.ly/3zcqo0a, 26న https://bit.ly/3mjgLYS సెప్టెంబం యూట్యూబ్ లింక్‌ల ద్వారా తెలుగు భాషాభిమానులు కార్యక్రమాన్ని వీక్షించవచ్చని, వివరాలకు సంచాలకుడు లక్ష్మీ రాయవరపు (టోరంటో, కెనడా) [email protected] వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సాస్, యూఎస్‌ఏ) [email protected] ద్వారా సంప్రదించాలని సూచించారు.