బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం చందూ ఛాంపియన్. కబీర్‌ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఈ పోస్టర్ గమనిస్తే, కార్తీక్ ఆర్యన్ అథ్లెట్ లుక్‌లో అదరగొడుతున్నాడు. భారతదేశం నుంచి మొదటి పారాలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచిన ఫ్రీస్టైల్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది.
1965 ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మురళీకాంత్ అంగ వైకల్యానికి గురయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్‌లో పాల్గొని ఈత విభాగంలో గోల్డ్ మెడల్‌ను సాధించారు. ఆయన స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు కబీర్ ఖాన్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నదియావాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియావాలా నిర్మిస్తుండగా, జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.