Namaste NRI

శశివదనే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా అహి తేజ బెల్లంకొండ నిర్మిస్తున్న చిత్రం శశివదనే. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ పూర్తయింది. నిర్మాత అహితేజ బెల్లకొండ మాట్లాడుతూ ఇంతవరకు 30 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్ల మీద ప్రేమ, హాస్య సన్నివేశాలు తీశాం. త్వరలో తదుపరి  షెడ్యూల్‌ మొదలవుతుంది. దర్శకుడు, ఛాయాగ్రహకుడు సినిమాను చాలా గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నారు అని చెప్పారు. త్వరలో ప్రారంభం కానున్న రెండో షెడ్యూల్‌లో రఘు కుంచెగారు. శ్రీమాన్‌ గారు, మహేష్‌ జాయిన్‌ అవుతారు.  గోదావరి నేపథ్యంలో తీస్తున్న లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామా ఈ శశివదనే. లవ్‌ సీన్స్‌ చాలా కొత్తగా ఉంటాయని అన్నారు. సాయి మోహన్‌ ఉబ్బన దర్శకుడు. రఘు కుంచె, శ్రీమాన్‌, దీపక్‌ ప్రిన్స్‌, మహేష్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఛాయాగ్రహణం : సాయికుమార్‌ దార, సంగీతం: శరవణ వాసుదేవన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events