నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మ్యాడ్. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. కల్యాణ్ శంకర్ దర్శకుడు. సూర్యదేవర హారిక, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ చిత్రంలోని ఫ్రౌడ్సే బోలో ఆయామ్ సింగిల్ అనే గీతాన్ని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందించారు. జీవితంలో సింగిల్‌గా ఉంటూ సంతోషంగా గడిపితే చాలనుకునే యువతరం తాలూకు మనోభావాలను ఆవిష్కరిస్తూ హుషారుగా సాగిందీ గీతం. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇదని చిత్రబృందం పేర్కొంది. ఈ వినోదాత్మక చిత్రంలో శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: ఎస్.నాగవంశీ, రచన-దర్శకత్వం: కల్యాణ్‌శంకర్. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.