Namaste NRI

అతడితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నడపలేదు.. గేట్స్‌ ఫౌండేషన్‌

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ సెక్స్ రాకెట్‌ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ఎస్‌స్టీన్‌కు‌, దాతృత్వ సంస్థ గేట్స్ ఫౌండేషన్‌ సిబ్బందికి మధ్య సంభాషణ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో గేట్స్‌ ఫౌండేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తాము అతడిని ఎప్పుడూ నియమించుకోలేదని, అతడితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపలేదని ఆ ప్రకటనలో పేర్కొన్నది.

ఆరోగ్య సంరక్షణ, అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చే దాతలను సమకూరుస్తానని అప్పట్లో ఎప్‌స్టీన్ చెప్పడంతో ఫౌండేషన్ సిబ్బంది కొందరు అతడితో సంభాషణలు జరిపారు. అయితే తర్వాత ఈ విషయంలో ముందుకువెళ్లలేదు. అతని పరిచయాల ద్వారా ఫౌండేషన్‌ కోసం ఎలాంటి నిధి ఏర్పాటు చేయలేదు. విషయం ఏదైనా ఫౌండేషన్‌ సిబ్బంది అతడితో మాట్లాడటంపై మేం చింతిస్తున్నాం అని గేట్స్‌ ఫౌండేషన్‌ తన ప్రకటనలో తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events