అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తనను అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ తరపున అధ్యక్ష నామినేషన్‌ను సాధించి, ఎన్నికల్లో గెలుస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడమే తన లక్ష్యమన్నారు. ట్రంప్‌ను ఓడించడంలో దేశాన్ని ఏకం చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని హారిస్ పేర్కొన్నారు.