Namaste NRI

వాట్సాప్‌ శుభవార్త …ఇంటర్‌నెట్‌ లేకుండానే

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ కంపెనీ వాట్సాప్‌ యూజర్లకు శుభవార్త చెప్పింది. యూజర్ల ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఫొటోలు, వీడియోలు, మీడియా తదితర ఫైల్స్‌ అన్నీ ఆఫ్‌ లైన్‌ లోనూ షేర్‌ చేసుకునే వెసులుబాటు కలుగనున్నది. ఈ ఫీచర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను వాట్సాప్‌ ఫీచర్స్‌ను ట్రాక్‌ చేసే వాబీటాఇన్ఫో తెలిపింది. మొబైల్‌లో ఇంటర్‌నెట్‌ సదుపాయం లేకుండా పంపే ఫైల్స్‌ సైతం ఎన్‌క్రిప్ట్‌ చేయబడుతాయని,  తద్వారా సెక్యూరిటీ ఉంటుందని నివేదిక పేర్కొంది. కొత్త ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ని సైతం రివీల్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. విజయవంతమైతే త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నది.

Social Share Spread Message

Latest News