బీజింగ్ ఒలింపిక్స్‌ను బహిష్కరించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. మానవ హక్కుల ఉల్లంఘన, చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని జస్టిన్ ట్రుడో ప్రకటించారు. వచ్చేడాది బీజింగ్‌లో జరిగె వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకల్లో తమ దేశం తరపున అధికారులు గానీ, రాయబారులు గానీ పాల్గొనరని తెలిపారు. అయితే క్రీడాకారులు క్రీడల్లో పాల్గొంటారని వెల్లడిరచారు. తమ భాగస్వామ్య దేశాలతో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ట్రుడో తెలిపారు. బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరిస్తున్నామని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, లిథువేనియాలు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా చేరడంతో ఈ సంఖ్య ఐదుకు చేరింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)