Namaste NRI

అగ్రరాజ్యంలో పెరుగుతున్న ఆసియన్ల జనాభా…

అగ్రరాజ్యం అమెరికాలో ఆసియన్ల సంఖ్య పెరుగుతోంది. మరే ఇతర మైనార్టీల కంటే ఆసియన్ల సంఖ్య గత దశాబ్ద కాలంలో చాలా పెరిగిందని ఆ దేశ జనాభా లెక్కల్లో వెల్లడైంది. 2020 సంవత్సరం నాటికి ఆసియన్‌ అమెరికన్ల సంఖ్య 2.4 కోట్లకు చేరుకున్నట్టు తేలింది. అమెరికా జనాభా గణన బ్యూరో వెల్లడిరచింది. అమెరికాలో మైనార్టీ కమ్యూనిటీల ప్రాబల్యమే ప్రస్తుతం అధికంగా ఉంది. అందులోనూ ఆసియన్లు 7.2 శాతం మంది ఉన్నారు. 1776 అమెరికా ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా వైట్‌ అమెరికన్ల సంఖ్య తగ్గడం విశేషంగా చెప్పుకోవాలి. అమెరికాలో తెల్లజాతీయుల సంఖ్య తొలిసారిగా 60 శాతానికి దిగువకి పడిరది.

                2000 ఏడాదిలో వారి జనాభా 69 శాతం ఉంటే 2020 నాటికి 63.7 శాతానికి తగ్గింది. 2020లో ఇది 58 శాతానికి తగ్గినట్టుగా జనగణనలో వెల్లడైంది. అమెరికాలో గత దశాబ్ద కాలంలో మొత్తంగా జనాభా 7.4 శాతం పెరిగి 33.1 కోట్లకు చేరుకుంది. 1930 తర్వాత జనాభా అతి తక్కువగా పెరగడం గత దశాబ్దంలోనే జరిగింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events