రోషన్ హీరోగా రూపొందిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా చాంపియన్. అనస్వర రాజన్ కథానాయిక. ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ కలిసి నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలూ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయని మేకర్స్ ఆనందం వెలిబుచ్చుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు. అగ్ర నటి సమంత ఈ పాటను విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ పాటలో రోషన్ డ్యాన్స్ అదరగొట్టాడనీ, ఫ్లోర్‌పై జాజ్ బీట్స్‌కు అనుగుణంగా అతని బాడీ లాంగ్వేజ్, అబ్బురపరిచే డ్యాన్స్ మూవ్‌మెంట్స్ ప్రేక్షకుల్ని మంత్రముగ్థుల్ని చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఐ యామ్ ఏ చాంపియన్ అంటూ కేకే రాసిన ఈ పాటను మిక్కీ జె.మేయర్ స్వరపరచగా, పి.జయరామ్, రమ్య బెహరా ఆలపించారు. ఈ చిత్రం ఈ నెల 25న గ్రాండ్‌గా విడుదల కానున్నది.















