ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన పుష్ఫ మూవీ ప్రమోషన్స్ కోసం రష్యాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు యూనిట్ చిత్ర దర్వకుడు సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన్నా నిర్మాతలు కూడా ఉన్నారు. సెప్టెంబర్‌లో జరిగిన మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను రష్యన్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ వేదిక మీదే ఈ చిత్రాన్ని రష్యన్ డబ్బింగ్ వర్షన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. తాజాగా తేదీని వెల్లడిరచారు. డిసెంబర్ 8న పుష్ప చిత్రాన్ని రష్యాలో విడుదల చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలిపింది. డిసెంబర్ 1న మాస్కోలో, 3న సెయంట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రీమియర్స్ వేయనున్నారు. అలాగే చిత్ర బృందం కూడా అక్కడ ప్రేక్షకులను పలకరించనున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)