Namaste NRI

జాక్ పాట్ కొట్టిన భారతీయుడు.. లాట‌రీలో  

 దుబాయ్‌లో ప‌నిచేస్తున్న ఓ ఇండియ‌న్ డ్రైవర్ యూఏఈలో కొత్త ఏడాది తొలి రోజే కోట్లు గెలుచుకున్నాడు. డిసెంబ‌ర్ 31న జ‌రిగిన బిగ్ టికెట్ లైవ్ డ్రాలో జాక్‌పాట్ ప్రైజ్ 20 మిలియ‌న్ యూఏఈ దీర్హాంలు (దాదాపు రూ. 44 కోట్లు) గెలుచుకున్నాడు. సిరీస్ 259 బిగ్ టికెట్ లైవ్ డ్రాలో మునావ‌ర్ ఫైరూస్ ల‌క్కీ విన్న‌ర్‌గా నిలిచి న్యూ ఇయ‌ర్‌ను జోష్‌తో ప్రారంభించాడు. ఫైరూస్ గ‌త ఐదేండ్లుగా ప్ర‌తి నెలా కొనుగోలు చేస్తుండ‌గా బిగ్ విన్ గురిం చి తెలిసి షాక్‌కు గురయ్యాడు. అయితే ఇంత భారీ మొత్తం అత‌డు ఒక్క‌డే గెలుచుకోలేదు. టికెట్ కొనుగో లుకు కంట్రిబ్యూట్ చేసిన మ‌రో 30 మంది వ్య‌క్తుల‌తో ఈ మొత్తాన్ని పంచుకోనున్నాడు. ఈ భారీ జాక్‌పాట్ త‌న‌ కు ద‌క్కుతుంద‌ని ఊహించలేద‌ని, కొద్ది స‌మ‌యం త‌ర్వాత ఈ న‌గ‌దును ఎలా ఖ‌ర్చు చేయాల‌ న్న‌ది ఆలోచిస్తామ‌ని ఫైరూస్ చెప్పుకొచ్చాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events