
నూతన హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వాషింగ్టన్ డీసీలోని జిల్లా జడ్జి బెరిల్ హోవెల్ సమర్ధించారు. అది విధానపరమైన నిర్ణయమని, వలసలను నియంత్రించేందుకు తనకున్న అధికారాలను ట్రంప్ వినియోగించుకున్నారని తెలిపారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాకు చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆయన తోసిపుచ్చారు. ట్రంప్ పెంచిన ఫీజు ఇమ్మిగ్రేషన్ చట్టానికి విరుద్ధంగా ఉన్నదని, దీనివల్ల అనేక కంపెనీలు, ఆస్పత్రులు, ఇతర యాజమాన్య సంస్థలు ఉద్యోగాలు, సేవల్లో కోత పెడతాయని పిటిషనర్ వాదించారు. వివిధ దేశాలకు చెందిన నిపుణులను ఆకర్షించేందుకు హెచ్-1బీ వీసా కార్యక్రమం అమెరికాకు ఉపకరిస్తున్న విషయం తెలిసిందే.















