Namaste NRI

కశ్మీర్‌ సరిహద్దులో మరోమారు కలకలకం

కశ్మీర్‌ సరిహద్దులో మరోమారు డ్రోన్‌ కలకలం సృష్టించింది. కథువా జిల్లా సమీపంలో అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్‌కు చెందిన ఓ డ్రోన్‌ భారత్‌లోకి ప్రవేశించింది. అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ డ్రోన్‌ను కూల్చి వేశాయి. డ్రోన్‌ పెద్ద బాక్సును మోసుకొచ్చినట్లు గుర్తించాం. బాక్సులో 7 గ్రనేడ్లు, 7 మ్యాగ్నెటిక్‌ బాంబులు ఉన్నట్లు గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. డ్రోన్‌ కూల్చివేసిన ప్రాంతాన్ని బాంబు నిర్వీర్య బృందం తనిఖీ చేసింది. ఈ ఘటనపై ఆర్మీ దర్యాప్తునకు ఆదేశించింది. అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభానికి కొద్దిరోజుల ముందు ఆయుధాలతో డ్రోన్‌ కనిపించటం ప్రాధాన్యం సంతరించుకుంది. అమర్‌నాథ్‌ యాత్రను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారనే నిఘా వర్గాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 43 రోజులపాటు సాగే ఈ యాత్ర జూన్‌ 30న రెండు దారుల్లో ప్రారంభం కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events