దేశంలో జననాల రేటును పెంచేందుకు జపాన్ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతున్నది. వారానికి నాలుగు రోజుల పని దినాలను అమలు చేయాలని నిర్ణయించింది. దీని వల్ల క్షీణిస్తున్న సంతానోత్పత్తి సమస్యను ఎదుర్కోవచ్చని ప్రభు త్వం భావిస్తున్నది. జపాన్‌ను ప్రస్తు తం వృద్ధ జనాభా సంఖ్య ఆందోళనకు గురిచేస్తున్నది. దేశ జనాభా మొత్తంగా తగ్గుతున్నప్పటికీ 65 ఏండ్లు పైబడిన వృద్ధులు దేశంలో 29.3%మంది ఉండడం ప్రభుత్వాన్ని ఆందోళనపరుస్తున్నది. కొత్త విధానం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 3 రోజులు కుటుంబంతో గడపవచ్చు. టోక్యో మహిళా గవర్నర్ యురికో కొయికే ఈ ఆలోచనను అమలు చేయనున్నారు.