వాట్సాప్ వినియోగదారుల డివైజ్‌లలో అక్రమంగా పెగాసస్ స్పైవేర్‌ను జొప్పించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ సంస్థపై మెటా దాఖలు చేసిన కేసులో అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ వినియోగదారుల డివైజ్‌ల హ్యాకింగ్‌కు ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌దే బాధ్యత అని స్పష్టం చేసింది. వాట్సాప్‌లోని బగ్‌ను ఉపయోగించుకొని అక్రమంగా స్పైవేర్‌ను జొప్పించిందని ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌పై మెటా సంస్థ 2019లో అమెరికా కోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఫిల్లిస్ హమిల్టన్ 1400 మంది వాట్సాప్ వినియోగదారుల డివైజ్‌లు లక్ష్యంగా మారడానికి పెగాసస్ స్పైవేర్ తయారుచేసిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సంస్థ సంబంధిత చట్టాల్లోని నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. కోర్ట్ వ్యాఖ్యల పట్ల మెటా సంస్థ హర్షం వ్యక్తం చేయగా, ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ స్పందించలేదు.