మాదక ద్రవ్యాల కేసుల విషయంలో కువైత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేరస్తులు, సంఘ విద్రోహ శక్తులపై కువైట్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కూడా కొరడా రaుళిపిస్తోంది. మాదకద్రవ్యాల కేసులు నమోదైన విదేశీయులను ఆ దేశం బహిష్కరించింది. 2021లో ఆ దేశంలో 886 మంది విదేశీయులపై డగ్స్ర్ కేసులు నమోదయ్యాయి. దీంతో వీరందరినీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం దేశం నుంచి బహిష్కరించింది. డ్రగ్స్ కేసులు నమోదైన వారిలో ఎక్కువ మంది భారతీయులు, ఈజిప్ట్‌కు చెందిన వ్యక్తులు ఉన్నారు. కొన్నేళ్లుగా కువైట్‌లో మాదక ద్రవ్యాలు పెద్ద మొత్తంలో పట్టుబుడుతున్నాయి.














