Namaste NRI

మేఘాలు చెప్పిన ప్రేమ కథ రిలీజ్‌కి రెడీ

నరేష్‌ అగస్త్య, రబియా ఖతూన్‌ జంటగా రూపొందుతున్న మ్యూజికల్‌ రొమాంటిక్‌ డ్రామా మేఘాలు చెప్పిన ప్రేమకథ. విపిన్‌ దర్శకుడు. ఉమాదేవి కోట నిర్మాత. ఈ సందర్భంగా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. హీరో నరేష్‌ అగస్త్యతోపాటు ప్రధాన తారాగణాన్నంతా ఆ పోస్టర్‌లో చూడొచ్చు. రాధిక శరత్‌కుమార్‌, సుమన్‌, ఆమని, తనికెళ్ల భరణి, వెంకటేష్‌ కాకుమాను. విద్యుల్లేఖ, తులసి, మాస్టర్‌ కార్తికేయ, మోహన్‌ రామన్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  జూలై 17న సినిమాను విడుదల చేయనున్నట్టు ఓ ప్రకటన ద్వారా మేకర్స్‌ తెలియజేశారు. ఈ చిత్రానికి కెమెరా: మోహనకృష్ణ, సంగీతం: జస్టిస్‌ ప్రభాకరన్‌, ఆర్ట్‌: తోట తరణి.

Social Share Spread Message

Latest News