అమెరికాలో మరోసారి కాల్పులు మోత మోగింది. డెట్రాయిట్‌లోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో ఈ దాడి జరిగిందని భద్రతాధికారి మైక్ మెక్‌కేబ్ తెలిపారు. మిచిగాన్‌లోని ఓ స్కూల్‌లో 15 ఏండ్ల బాలుడు తోటి విద్యార్థులపై కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. అందులో ఒక ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడు. మృతి చెందిన వారిలో బాలుడు సహా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఘటనకు సంబందించి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. అంతా ఐదు నిమిషాల్లో జరిగిపోయిందన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12:55 గంటల సమయంలో పాఠశాలలో కాల్పులు జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని వెల్లడిరచారు. నిందితుడు ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్నాడని తెలిపారు. అతని నుంచి ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ సహా పలు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గాయపడినవారిలో ఇద్దరికి సర్జరీ జరిగిందని, మరో ఆరుగురు క్షేమంగా ఉన్నారని తెలిపారు.
మిచిగన్ గవర్నర్ గ్రెట్బెన్ విట్మెర్ మరణాలపై విచారం వ్యక్తం చేశారు. మన పిల్లలు పాఠశాలలో సురక్షితంగా ఉండేందుకు సమాజం కలిసి రావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకీ మాట్లాడుతూ అధ్యక్షుడు జో బైడెన్ కాల్పుల గురించి తెలియజేసినట్లు తెలిపారు. ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన దు: ఖాన్ని భరిస్తున్న కుటుంబాలకు బైడెన్ సానుభూతి తెలిపారు.