రష్మిక మందన్న నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం మైసా. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక గోండు తెగకు చెందిన యోధురాలి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. నా బిడ్డ సచ్చిందన్నారు. కానీ మట్టే వణికిపోయింది నా బిడ్డ రక్తాన్ని దాచలేక, గాలే ఆగిపోయింది నా బిడ్డ ఊపిరిని మోయలేక, అగ్గే బూడిదయింది మండుతున్న నా బిడ్డను చూడలేక, ఆఖరికి సావే సచ్చిపోయింది నా బిడ్డను సంపలేక, నా బిడ్డ ఎవరో తెలుసా? అంటూ కథానాయిక తల్లి వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగింది.

రష్మిక మందన్న మునుపెన్నడూ చూడని రా అండ్ వయొలెంట్ క్యారెక్టర్‌లో కనిపించింది. రక్తమోడుతున్న దుస్తులతో ఇంటెన్స్ ఎమోషన్స్‌తో మైసా పాత్రలో ఆమె ఆకట్టుకుంది. తనకు జరిగిన అన్యాయంపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న వీరనారిగా రష్మిక మందన్న పాత్ర అత్యంత శక్తివంతంగా అనిపించింది. ప్రస్తుతం తెలంగాణ, కేరళలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరుపుతున్నామని, రష్మిక మందన్న కెరీర్‌లో మైలురాయిలా నిలిచే చిత్రవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాతలు: అన్‌ఫార్ములా ఫిల్మ్స్, రచన-దర్శకత్వం: రవీంద్ర పుల్లె.















