Namaste NRI

తయారీ రంగం పుంజుకోవడం మొదలైంది : జో బైడెన్

అమెరికాలో తయారీ రంగం పుంజుకోవడం మొదలైందని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన విద్యుత్తు వాహనాల బ్యాటరీల తయారీ కర్మాగారాన్ని అమెరికాలో ప్రారంభించనుంది.  ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ విద్యుత్తు కార్ల వినియోగాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.  ట్రైటియం సంస్థ ఏర్పాటు చేసే ఈ కొత్త ప్లాంట్‌ ఏటా 30 వేల విద్యుత్తు వాహనాలకు అవసరమైన ఛార్జర్లను తయారు చేస్తుందన్నారు. ఇది స్థానికంగా 500  ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపారు. ఈ ఏడాది తృతీయ త్రైమాసికంలో ఇది ఉత్పత్తిని ప్రారంభించనుందన్నారు.  ఈ ఛార్జర్లలో పూర్తిగా అమోరికా విడిభాగాలనే,  ఇనుము,  స్టీల్‌నే వినియోగిస్తారని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events