Namaste NRI

భారత సంతతి కుర్రాడి ఘనత

భారత సంతతికి చెందిన అమెరికా కుర్రాడు సమీర్‌ బెనర్జీ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నిలో జూనియర్‌ బాలుర సింగిల్స్‌ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 17 ఏళ్ల సమీర్‌ బెనర్జీ 7`5, 6`3తో అమెరికాకే చెందిన విక్టర్‌ లిలోవ్‌పై గెలుపొందాడు. గత నెలలో పారిస్‌లో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ జూనియర్‌ విభాగంలో సమీర్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. సమీర్‌ తండ్రి కునాల్‌ అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తికాగా, తల్లి ఉషా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ పట్నం జిల్లాలో పుట్టి హైదరాబాద్‌లో పెరిగారు.

                 1980 దశకంలో కునాల్‌, ఉష అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడి వివాహం చేసుకున్నారు. న్యూజెర్సీలో నివాసం ఉంటున్న సమీర్‌ గత ఏడాది కాలంలో జూనియర్‌ స్థాయిలో 16 టోర్నీలు ఆడి 10 టోర్నీలలో ఫైనల్‌కు చేరాడు. ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. ఈ ట్రోఫీని చూస్తూ, ప్రేరణ పొందుతూ వింబుల్డన్‌లోనే ప్రొఫెసనల్‌ ప్లేయర్‌గా తిరిగి వస్తానని నమ్మకంతో ఉన్నాను. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోవడంతో పెద్దగా అంచనాలు లేకుండా ఇక్కడకు వచ్చాను. ఒక్క మ్యాచ్‌లో గెలిస్తే చాలు అకునున్నా. ఇప్పుడే ఏకంగా టైటిల్‌నే సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది అని సమీర్‌ వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events