Namaste NRI

అంచ‌నాల‌ను రెట్టింపు చేసిన రాకాస ట్రైలర్

సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన తాజా చిత్రం రాకాస. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ (స్నేక్ డ్యాన్స్, రాపప్ప) సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

సుమారు 2 నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తూనే నవ్వులు పూయిస్తోంది. ఒక మారుమూల గ్రామంలో భయంకరమైన బ్రహ్మరాక్షసుడికి బలి ఇచ్చే ఆచారం చుట్టూ కథ తిరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. హారర్, ఫాంటసీ అంశాలను మిక్స్ చేస్తూ, దానికి సంగీత్ శోభన్ మార్కు కామెడీని జోడించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా దెయ్యాలకు భయపడుతూ సంగీత్ చేసే కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంది.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాజు ఎదురురోలు, సంగీతం : అనుదీప్‌ దేవ్‌, ఎడిటర్‌ : అన్వర్‌ అలీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : రమేష్‌ మన్యం, కొరియోగ్రఫీ : జెడి, భాను, ఆర్ట్‌ డైరెక్టర్‌ : విష్ణు వర్ధన్‌ పుల్లా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events