మన ఆవులకు దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. తాజాగా నెల్లూరు మేలు రకానికి చెందిన ఓ ఆవు బ్రెజిల్ లో రికార్డు ధర పలికింది. వయాటినా – 19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవిస్ అని పిలవబడే నెల్లూరు జాతికి చెందిన ఆవు బ్రెజిల్ వేలంలో ఏకంగా 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడుపోయిం ది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.40 కోట్లన్నమాట. భారతదేశానికి చెందిన ఈ మేలుజాతి ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డుకెక్కింది. దీంతో ఈ అంశం కాస్తా ప్రస్తుతం చర్చీనాయాం శమవుతోంది.ఈ రకపు ఆవును 1868లోనే బ్రెజిల్‌కు తరలించారు. అప్పటి నుంచి ఈ రంక ఆవులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది.