సందీప్‌కిషన్ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన చిత్రం ఊరు పేరు భైరవకోన. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ట్రైలర్‌ను ఆవిష్కరించారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందివ్వాలనే లక్ష్యంతో ఈ సినిమా కోసం రెండున్నరేళ్ల నుంచి కష్టపడుతున్నాం. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ కథలో ఎన్నో సర్‌ప్రైజ్‌లుంటాయి అన్నారు. గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన అనే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ భైరవకోన అనే ఫాంటసీ ప్రపంచా న్ని ఆవిష్కరించింది. భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం చేతికి అంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు, చేసిన పాపాన్ని కడగడం వంటి సంభాషణలు కథపై ఆసక్తిని పెంచాయి. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ఇదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని దర్శకుడు వీఐ ఆనంద్ తెలిపారు.
నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ ఈ సినిమాలో మంచి ప్రేమకథతో పాటు కామెడీ, ఫాంటసీ, యాక్షన్ అంశాలుంటాయి. రెండున్నరేళ్ల మా శ్రమకు తగిన ఫలితం దక్కుతుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: శేఖర్‌చంద్ర, మాటలు: భాను భోగవరపు, నందు సవిరిగాన, సమర్పణ: అనిల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వీఐ ఆనంద్.