Namaste NRI

చైనా సంస్థ సరికొత్త రికార్డు..మస్క్​ స్టార్​లింక్​ను వెనక్కినెట్టి మరీ!

ఆరో తరం వైర్‌లెస్‌ సమాచార సాంకేతికత 6జీలో చైనాకు చెందిన చాంగ్‌ గువాంగ్‌ శాటిలైట్‌ టెక్నాలజీ సంస్థ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ సంస్థ అంతరిక్షం నుంచి భూమిపైకి లేజర్‌ ట్రాన్స్‌మిషన్‌తో సెకనుకు 100 గిగాబిట్ల (జీబీపీఎస్‌) డాటాను పంపించగలిగినట్టు తెలిసింది. చాంగ్‌ గువాంగ్‌ అనేది వాణిజ్య ఉపగ్రహ సంస్థ.  అంతరిక్షంలోని తన జిలిన్‌-1 ఉపగ్రహం నుంచి భూమిపైన ఒక ట్రక్‌లో ఉన్న కేంద్రానికి డాటాను పంపించగలిగింది.

 ఇంతకుముందు ఈ సంస్థ అందుకున్న వేగం కంటే ఇది దాదాపు 10 రెట్లు అధికం. 100 జీబీపీఎస్‌ వేగం అంటే ఒక సెకనుకు దాదాపు 10 సినిమాలను పంపించడంతో సమానమని ఈ సంస్థ ప్రతినిధి వాంగ్‌ హాంఘాంగ్‌ తెలిపారు. ఈ సాంకేతికతను ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ సంస్థ కూడా అభివృద్ధి చేసినట్టు కథనాలు ఉన్నప్పటికీ ఎంత వేగాన్ని అందుకున్నదనే అంశంపై స్పష్టత లేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events