సరిగా మాటలు రానివారి కోసం ఐఫోన్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నది. ఐఫోన్, ఐప్యాడ్‌లలో పర్సనల్ వాయిస్ అనే ఫీచర్‌ను ఉపయోగించుకొని ఏదైనా టెక్ట్స్‌ను ఆడియో రూపంలోకి మార్చవచ్చు. సరిగా మాట్లాడలేని, మూగవారి కోసం ఈ కొత్త ఆప్షన్‌ను ఐఫోన్ రూపొందించింది. పర్సనల్ వాయిస్ అనే ఆప్షన్ ద్వారా సదరు యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో 15నిమిషాల వరకు మాట్లాడవచ్చునని, యూజర్ల సొంత గొంతును ఐఫోన్‌లోని సింథటిక్ వాయిస్ ఆడియో రూపంలోకి మార్చుతుందని ఐఫోన్ బోర్డ్ మెంబర్ ఫిలిప్ గ్రీన్ తెలిపారు.