Namaste NRI

మారేడుమిల్లి ప్రజానీకం సిద్ధం

అల్లరి నరేశ్‌ హీరోగా ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌. జీ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌ పతాకాలపై రాజేష్‌ దండా నిర్మించిన సినిమా ఇది. టీజర్‌కి అద్భుతమైన రెప్పాన్స్‌ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రంలో గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నికల విధులకు వచ్చిన ప్రభుత్వాధికారి పాత్రలో నటించారు అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాను నవంబరు 11న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల, కెమెరా: రాం రెడ్డి, సహనిర్మాత : బాలాజీ గుత్తా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events