ఈ పవిత్ర సంవత్సరంలో ఆయుధాల గర్జనలను ఆపే ధైర్యాన్ని కూడగట్టుకోవాలని, ప్రపంచంలో వ్యాపిస్తున్న విభజనలను అధిగమించాలని పోప్ ఫ్రాన్సిస్ అన్ని దేశాల ప్రజలకు క్రిస్మస్ సందేశం ఇచ్చా రు. మధ్య ప్రాచ్యం నుంచి ఉక్రెయిన్ వరకు, ఆఫ్రికా నుంచి ఆసియా వరకు విస్తరిస్తున్న విభజనవాదానికి అడ్డుకట్ట వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది క్రిస్మస్ 2025 పవిత్ర సంవత్సరంతో పాటు వచ్చింది. మన శత్రువులతోనూ విస్తృత స్థాయిలో సయోధ్య కుదుర్చుకోవాలని,ఆశావాద యాత్రికులుగా మారాలని పిలుపునిచ్చారు.