రోజా, ఖుషి, దినేష్ ప్రధాన పాత్రధారులుగా దేవేందర్ దర్శకత్వంలో, రోజా భారతి నిర్మిస్తున్న చిత్రం సీత ప్రయాణం కృష్ణతో. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ కెమెరా స్విచాన్ చేయగా, దాసరి మారుతి క్లాప్ కొట్టారు. తదనంతరం సినిమా పోస్టర్‌ని కూడా విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, దర్శకుడు వేణు ఉడుగుల, రచయిత డార్లింగ్ స్వామి, రుద్రాపట్ల వేణుగోపాల్, రామ్ రావిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఖుషి టాకీస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది.

