అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలకు ఉచితంగా మాస్క్‌లను పంపిణీ చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధం అయ్యింది. వైట్‌హౌస్ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ 400 మిలియన్ నాన్ సర్జికల్ ఎన్95 మాస్కులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఫార్మసీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఈ వారం చివరినాటికి మాస్కులను తరలించనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి ఈ మాస్కులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.. అమెరికా చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్యూప్మెంట్ను ప్రజలకు ఫ్రీగా అందించడం ఇదే తొలిసారని తెలిపారు.