ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ఎన్నికయ్యారు. డిసెంబర్ 17న ఆయన ప్రధానిగా భాధ్యతలు చేపట్టనున్నారు. 43 ఏళ్ల లియో ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నిక కావడం ఇది రెండోసారి. ఫిన్ గేల్ పార్టీకి చెందిన ఈయన 2017 నుంచి 2020 వరకు లియో ఐర్లాండ్ ప్రధానిగా పని చేశారు. ఐర్లాండ్‌లోని యువ నాయకుల్లో లియో ఒకరు. అంతేకాదు తాను ఒక గే అని ఆయన బహిరంగంగా ప్రకటించారు. 2016 లో యూరోపియ్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన తర్వాత ఐర్లాండ్‌కు ఆర్థిక కష్టాలు రాకుండా చూశారనే పేరు లియోకు ఉంది. క్యాథలిక్ మైనార్టీల ప్రభావం ఎక్కువగా ఉండే ఐర్లాండ్‌లో లియో వరద్కార్ ఒక రాజకీయ శక్తిగా ఎదగడం అనేది గుర్తించదగ్గది. లియో తండ్రి పేరు అశోక్ వరాద్కర్. మహారాష్ట్రలోని వరాద్ గ్రామానికి చెందిన ఆయన ఒక డాక్టర్. బ్రిటన్‌కు 1906లో వలస వచ్చారు. అక్కడ నర్సుగా పనిఏస్తున్న ఐర్లాండ్ యువతిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు లియో జన్మించారు. 2019లో లియో తన తండ్రి స్వగ్రామమైన వరాద్‌కు వచ్చారు.