Namaste NRI

అజ్ఞాతంలోకి ఆ దేశ ప్రధాని… ఎందుకంటే

దేశ రాజధానిలోని అధికారిక నివాసం నుంచి కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో ఆయన కుటుంబంతో కలిసి ఓ రహస్య ప్రాంతానికి వెళ్లారు. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన ఆంక్షల, నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తతడంతో ఆయన అత్జాతంలోకి వెళ్లారు. ఆందోళనలు హింసాత్కంగా మారే అవకాశం ఉన్నందున ఆయన్ని రహస్య ప్రాంతానికి తరలించాలని భాత్రత వర్గాలు నిర్ణయించాయి. కరోనా కట్టడిలో భాగంగా ట్రూడో ప్రభుత్వం వ్యాక్సిన్లను తప్పనిసరి చేసింది. మాస్కులు ధరించడం, సామాజిక దూరం సహా ఇతర నిబంధనల్ని కఠినతరం చేసింది. ముఖ్యంగా వ్యాక్సిన్లు తీసుకొని ట్రస్కు డ్రైవర్లను దేశంలోకి అనుమతించేది లేదని ప్రకటించడం ఆందోళనకు దారితీసింది. తొలి నుంచి వ్యాక్సిన్లను వ్యతిరేకిస్తున్న ఓ వర్గం దీనిపై గళమెత్తింది.

                        కరనో నేపథ్యంలో అమెరికా నుంచి వచ్చే ట్రక్కు డ్రైవర్లను నాలుగు రోజులపాటు క్వారంటైన్‌కు పంపాలన్న నిబంధన మరింత ఆగ్రహానికి గురి చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ర్యాలీగా రాజధాని ఒట్టావాకు బయలుదేరారు. దీంతో రాజధానిని దారి తీసే రహదారులన్నీ ట్రక్కు కాన్వాయ్‌ లతో కిక్కిరిసిపోయాయి. ఫ్రీడం కాన్వయ్‌ పేరిట తరలిస్తున్న ఈ ట్రక్కులన్నీ ఒట్టావాలోకి ప్రవేశిస్తే హింస చెలరేగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ముందు జాగ్రత్తగా ప్రధానిని రహస్య ప్రాంతానికి తరలించారు.  రాజధాని వీధుల్లో పదివేల మంది చేరి ఉండొచ్చని, భారీగా హింస జరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిరసనలు హింసాత్మకంగా మారే ప్రమాదం ఉందని గతంలోనే ప్రధాని ట్రూడో అనుమానం వ్యక్తం చేశారు. అయితే నిరసనకారులు, చాలా స్వల్పమని, మెజార్టీ దేశస్తులు వీరితో ఏకీభవించారని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events