బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్లు తమ బంధువులు ఉన్న ప్రాంతాలకు పారిపోయారు. ఇప్పుడు అలాంటి పని చేయాల్సిన అవసరం లేదని, బ్రిటన్కు రావాలని ఆయన పిలిచారు. అంతేకాదు ఉక్రెయిన్ నుంచి వస్తున్న వారికి ఎవరైనా తమ ఇంట్లో ఆవాస్తం కల్పిస్తే ఆ కుటుంబానికి నెలకు 350 పౌండ్లు అంటే 456 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.35 వేలు) చెల్లిస్తామని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఇంట్లో ఒక గదిలో అయినా సరే ఉక్రెయిన్లకు కనీసం ఆరు నెలలపాటు అవాసం కల్పించడానికి అంగీకరిస్తే హోమ్స్ ఫర్ ఉక్రెయిన్ పథకం కింద ఈ డబ్బు చెల్లిస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)