Namaste NRI

తెలంగాణ ప్రజలకు ప్రధాని భేషరతుగా క్షమాపణ చెప్పాలి : మహేష్ బిగాల

ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభ వేదికగా తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై మోదీ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇవన్నీ జరిగాక తలుపులు వేసి తెలంగాణ తెచ్చారు అనడం ఏమాత్రం సహించలేనిదన్నారు. తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు ప్రెస్‌ మీట్‌లు పెట్టి మోదీని సమర్థిస్తున్నారు. తెలంగాణ బిడ్డలై ఉండి కనీసం సోయి లేకుండా మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తన పద్ధతి మార్చుకోవాలన్నారు. తెలంగాణ రాకపోయి ఉంటే నువ్వు ఈ రోజు ఆ స్థానంలో ఉండేటోనివి కాదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీని తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేస్తారన్నారు. బీజేపీ ప్రజలకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. మొదటి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాలకే కేంద్రం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని విమర్శించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events