Namaste NRI

తాలిబన్లు ఇచ్చిన హామీని అమలు చేయాలి : జై శంకర్

అఫ్గానిస్థాన్‌ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోమంటూ ఇచ్చిన హామీని తాలిబన్లు అమలు చేయాలని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌ అన్నారు.  ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జరిగిన జీ`20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాల మనోభావాలను గమనించాలని సూచించారు. అఫ్గాన్‌ సమాజంలోని అన్ని వర్గాల కలయికగా ప్రభుత్వం ఉండాలని ప్రపంచం భావిస్తున్నట్టు తెలిపారు. అఫ్గాన్‌ను మానవతా దృక్పథంతో ఆదుకోవడానికి  అన్ని దేశాలు ముందుకు  రావాలని కోరారు. ఆ దేశ ప్రజలతో భారత్‌కు చారిత్రక సంబంధాలు  ఉన్నాయని, అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress